Eluru: దొంగల హల్ చల్ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తి లూటీ!
Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయిగూడెం పంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీలో దొంగలు పడ్డారు.
Eluru: దొంగల హల్ చల్ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తి లూటీ!
Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరాయిగూడెం పంచాయితీ పరిధిలోని వెంకటాపురం గ్రామ సమీపంలో పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులైన గిరిజనుల కోసం పునరావాస కాలనీ నిర్మాణం నిమిత్తం 2017,2018 సంవత్సరాల్లో ప్రభుత్వం వంద ఎకరాల 58 సెంట్ల భూమిని భూ సేకరణ చేసింది. అట్టి భూమిలో కమ్మరిగూడెం,కొత్తూరు, బంజరగూడెం,బోనగిరి, గుంపెనపల్లి,అల్లిగూడెం,వేలేరు,శ్రీధర,సీతారామనగరం గ్రామాలకు చెందిన 758 మంది ముంపు గ్రామాల నిర్వాసిత గిరిజనులకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇండ్ల నిర్మాణం చేపట్టింది.
ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీలో నిర్వాసిత గిరిజనులకు నిర్మిస్తున్న ఇండ్లతోపాటుగా రైతు సేవా కేంద్రం, గ్రామ సచివాలయం, వైయస్సార్ విలేజ్ హెల్త్ కమ్యూనిటీ భవనాలను నిర్మించింది. వెంకటాపురం - తిమ్మంపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని పునరావాస కాలనీ నిర్మాణం చేపట్టి 9 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడంతో కాలనీలోని ఇండ్ల చుట్టూ దట్టంగా పొదలు,విపరీతంగా చెట్లు పెరగడంతో అడవిలా ఉందని, ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీలోనుంచి ఏవైనా శబ్దాలు వచ్చినప్పుడు ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని పలువురు చెబుతున్నారు.
ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీలో నిర్మాణం పూర్తయిన ఇండ్లు,రైతు సేవా కేంద్రం, గ్రామ సచివాలయం, వైయస్సార్ విలేజ్ హెల్త్ కమ్యూనిటీ భవనాలకు తలుపులు, కిటికీలు అమర్చారు. ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీ వెంకటాపురం గ్రామాని రెండు మైళ్ళ దూరంలో ఉండగా,అటు తిమ్మంపేట గ్రామానికి ఐదు కిలోమీటర్ల ఉండటంతో ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఇండ్లు రైతు సేవా కేంద్రం, గ్రామ సచివాలయం, వైయస్సార్ విలేజ్ హెల్త్ కమ్యూనిటీ భవనాలకు అమర్చిన ,తలుపులు కిటికీలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.
రాత్రులు మనుషుల అలికిడి లేకపోవడంతో నిర్మానుషంగా ఉన్న ఆర్ అండ్ ఆర్ పునరావస కాలనీలోని ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పునరావాస కాలనీలోకి చొరబడి తలుపులు,కిటికీలు ఎత్తుకెళ్లడంతో పాటుగా ఇండ్లలో బిగించిన విద్యుత్తు పరికరాలను ధ్వంసం చేస్తున్నారని అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చిన అటువైపు కన్నెత్తి చూడడం లేదని బాహాటంగానే చెబుతున్నారు. ఒక్కో తలుపు విలువ రూ. 3 వేలు, కిటికీ విలువ రూ. 15 వందల నుంచి రూ.2 వేల వరకు ఉండొచ్చని సమాచారం.
ప్రభుత్వ ధనం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పునరావస కాలనీలోకి రాత్రులు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇండ్లకు అమర్చిన తలుపులు, కిటికీలు ఎత్తుకెళ్తున్న దుండగుల నుంచి దొంగిలించిన సొత్తును రికవరీ చేయడంతో పాటుగా పునరాగం ఆర్ అండర్ పునరావాస కాలనీలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.




