Shiv Pratap Shukla: శ్రీశైలం మల్లన్నసేవలో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు

Shiv Pratap Shukla: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు దర్శించుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 March 2026 11:45 AM IST
Shiv Pratap Shukla: శ్రీశైలం మల్లన్నసేవలో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు
X

Shiv Pratap Shukla: శ్రీశైలం మల్లన్నసేవలో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు

Shiv Pratap Shukla: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం దగ్గర గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీస్వామి వారికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ వేదపండితులు వేదఆశీర్వచనాలు అందచేశారు. ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు చిత్రపటం, తీర్థ ప్రసాదాలను గవర్నర్ దంపతులకు అందజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story