Mandasa; పలాసలో పొలిటికల్ హీట్ మందసలో తమ్ముళ్ల భారీ స్కెచ్!

Mandasa; పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు మందస మండల టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ స్థాయి సమావేశం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 6:35 PM IST
Mandasa
X

Mandasa; పలాసలో పొలిటికల్ హీట్ మందసలో తమ్ముళ్ల భారీ స్కెచ్!

మందస/పలాస: పలాస నియోజకవర్గము శాసన సభ్యురాలు ఎమ్మెల్యే గౌతు శిరీష గారు, సమన్వయకర్త శ్రీ వెంకన్న చౌదరి గారి ఆదేశాల మేరకు మందస మండలం పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం. పలాస ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెట్టింది.

మందస కార్యాలయంలో ఈ రోజు క్లస్టర్ మరియు యూనిట్, బూత్ లెవెల్ స్థాయి నాయకులతో మండల అధ్యక్షులు వారు బావన దుర్యోధన గారు, మండల కార్యదర్శి సాలీనా మాధవ రావు గారు అధ్యక్షతన, క్లస్టర్-5 ఇంచార్జీ కోర్ల కన్నారావు, కో ఇంచార్జీ బేసి ఈశ్వర్ రావు సమక్షం లో కీలక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గౌతు శిరీష అమ్మ గారి నిర్దేశం మేరకు, ప్రతి నాయకుడు మరియు కార్యకర్త బూత్‌ల వారీగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మన పార్టీకి దూరంగా ఉన్న వారిని గుర్తించి, గత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, వారిని మన వైపు మొగ్గు చూపేలా చేయాలని, ప్రతి ఇంటి తలుపు తట్టి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని, ఆయన చూచించారు.

ఇప్పుడు మనం అభివృద్ధి చెయ్యాల్సిన పనులు త్వరగా కంప్లీట్ చేసి, ఇంకా అందాల్సిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, కొన్ని అందని ప్రత్యేక పంచాయతీలు, గ్రామాలు గుర్తించి, వారికి కూడా అన్ని సంక్షేమ పథకాలు చేకూరేలా చెయ్యాలని పిలునిచ్చారు. తర్వాత ముఖ్యముగా మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసి మనం చేసిన ప్రతి ప్రోగ్రాం అందులో అప్లోడ్ చెయ్యాలని చెప్పారు.

రానున్న ఎన్నికల్లో గెలుపునకు ఈ సమావేశం అత్యంత కీలకమని ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న క్లస్టర్ మరియు యూనిట్, మరియు బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే దానిపై విస్తృతంగా చర్చించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story