Vijayawada: బీజేపీ ఆధ్వర్యంలో సాంస్కృతిక మహోత్సవం: పల్నాడులో పోస్టర్ ఆవిష్కరణ

Vijayawada: విజయవాడలో మార్చి 22న నిర్వహించనున్న శాలివాహన చక్రవర్తి – అతుకూరి మొల్ల సాంస్కృతిక వైభవంగా కార్యక్రమాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 March 2026 11:57 AM IST
Vijayawada
X

Vijayawada: బీజేపీ ఆధ్వర్యంలో సాంస్కృతిక మహోత్సవం: పల్నాడులో పోస్టర్ ఆవిష్కరణ!

విజయవాడ: విజయవాడలో మార్చి 22న సాంస్కృతిక వైభవానికి వేదిక సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “శాలివాహన చక్రవర్తి – అతుకూరి మొల్ల సాంస్కృతిక వైభవం” పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను పల్నాడు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు... శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వరావు కార్యక్రమ విశేషాలను వివరించారు....కుమ్మరి వృత్తి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని, ఈ వృత్తి ద్వారా వచ్చిన కళాత్మకతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. అదే సంప్రదాయం నుంచి వెలుగొందిన తొలి తెలుగు మహాకవయిత్రి అతుకూరి మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఆమె రచించిన “మొల్ల రామాయణం” తెలుగు భాషకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు.

ఇక శాలివాహన చక్రవర్తి ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచి చరిత్రలో చెరగని ముద్ర వేశారని, ఆయన పేరుతో ప్రారంభమైన శాలివాహన శకం భారతీయ కాలగణనలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. మార్చి 13న మొల్లమాంబ జయంతి, మార్చి 22న శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో ఈ మహోత్సవం జరుగనుంది. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ వద్ద ఉదయం 8 గంటల నుంచే టెర్రకోట ఉత్పత్తులు, కుమ్మరి కళాకృతుల ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రధాన మహాసభ నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కుమ్మర, శాలివాహన, ప్రజాపతి వర్గాలకు చెందిన ప్రజలు, బిసి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ముఖ్యమైన వ్యక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు..

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story