చెత్త నుండి ఎరువు.. ఇంటి వద్దే హోమ్ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

రాజాం పురపాలక సంఘంలో స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకు పెంపుపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు సమీక్ష.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 7:11 PM IST
Rajam
X

చెత్త నుండి ఎరువు.. ఇంటి వద్దే హోమ్ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

రాజాం/శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పురపాలక సంఘానికి స్వచ్ఛ సర్వేక్షన్‌లో మంచి ర్యాంకు రావడానికి మెప్మా సిబ్బంది అందరూ సమష్టిగా కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఏ. రామచంద్రరావు కోరారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా సిబ్బందికి ఆయన హోమ్ కంపోస్ట్ బిన్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటిలో హోమ్ కంపోస్ట్ తయారీ జరిగేలా మెప్మా సిబ్బంది ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలను చైతన్యపరచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ రాజేష్, శానిటేషన్ సెక్రటరీలు, ఎస్‌ఎల్‌ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story