సైబర్ నేరాలు, డ్రగ్స్ పట్ల జాగ్రత్త.. స్కూల్ విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పాలకొండ శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 4:54 PM IST
Palakonda
X

సైబర్ నేరాలు, డ్రగ్స్ పట్ల జాగ్రత్త.. స్కూల్ విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక

Palakonda: పాలకొండ శక్తి టీం,ఈ రోజు సీతంపేట మండలం లో పులి పుట్టి గ్రామంలో నందు ఉన్నటువంటి బారతి ఇంటర్నేషనల్ స్కూల్ క్రమశిక్షణ నియంత్ర అవగాహన కార్యక్రమాలు.

విద్యార్థులు ఎటువంటి తప్పుడు అలవాట్లు, ఆకర్షణలకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాము. మేము చెప్పే విషయాలను శ్రద్ధగా విని, చదువుపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి.

ప్రత్యేకంగా అమ్మాయిలు తమ భద్రతపై జాగ్రత్తగా ఉండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మరియు శక్తి యాప్ ఉపయోగం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలు చేయడం వల్ల నష్టాలు గురించి వివరిస్తూ వాటి హెల్ప్ లైన్ నెంబర్స్ -పోలీస్112, సైబర్ క్రైమ్ 1930, మాదక ద్రవ్యాలు 1972, చిన్నపిల్లల హెల్ప్ లైన్1098 , గురించి చెప్పడం జరిగింది.

18 సంవత్సరాలలోపు బాల బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, చిన్నపిల్లలపై జరుగు లైంగిక దాడుల గురించి జాగ్రత్త ఉండాలని, ఎటువంటి అట్రాక్షన్ కి గురికాకుండా ఉండాలని, అపరిచితుడు వ్యక్తులు కు దూరంగా ఉండాలని, అని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శక్తి టీం సిబ్బంది అయినా మహిళ ఏఎస్ఐ జి ఝాన్సీ భాయి కానిస్టేబుల్స్ రాము, గణపతి, ఈగల్ టీం కానిస్టేబుల్ వెంకటరమణ,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story