సీఎం గారు కొరత లేదన్నారు.. మరి మాకెందుకు అందడం లేదు?

సోంపేట మండలం ఏకూరులో గ్యాస్ సిలిండర్ల కొరతపై మహిళా సమాఖ్య ఆందోళన. 45 రోజుల నిబంధనను తొలగించి, 20 రోజులకే సిలిండర్ ఇవ్వాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 7:27 PM IST
Pukkalla Arelamma
X

సీఎం గారు కొరత లేదన్నారు.. మరి మాకెందుకు అందడం లేదు?

సోంపేట/శ్రీకాకుళం: సోంపేట మండలం ఉప్పలం పంచాయతి ఏకూరు లో గ్యాస్ కొరత నియంత్రించి మహిళల పడుతున్న కష్టాలు తీర్చాలి అని మహిళా సమాఖ్య NFIW జిల్లా కార్యదర్శి పుక్కల్ల అరేలమ్మ గారు డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి గ్యాస్ కొరత లేదని గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు చెప్పి.. ఎవరు గ్యాస్ కోసం అధైర్య పడకుండి ధైర్యంగా ఉండంమనీ. రాష్ట్రానికి ఏటువంటి కొరత లేదని చెప్పడం జరిగింది కానీ. ఇప్పుడేమో 45 రోజులకు ఒక గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు ఇబ్బంది పెడుతున్నారు ఇది భావ్యం కాదు ఒక కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ 20 రోజులు లేక 25 రోజులు వస్తుంది మిగతా రోజులు పస్తులు ఉండమంటారా..

కొంతమంది డోక్రా మహిళలు బ్యాంకులో అప్పులు తీసుకోనీ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ , ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు పెట్టుకొని జీవనం సాగించి తున్న మహిళలు ఆ సెంటర్లు మూతపడి నానా ఇబ్బందులు పడుతున్నారు.

కట్టెలు పొయ్య మీద వంట చేస్తామంటే.. సముద్రం తప్ప.. ఆడవిలేని తీరంలో ఉన్న మాకు కట్టెలు కూడా కరువే కాబట్టి 45 రోజులు కాల పరిమితిని దగ్గించి 20 రోజులు కే గ్యాస్ ఇవ్వాలని కోరారు,

ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story