Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ యువతపై, అభివృద్ధిపై జగన్ కు ద్వేషం ఎందుకు? లోకేష్ సంచలన ట్వీట్

Nara Lokesh: వైఎస్ జగన్ పై మంత్రి లోకేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి, యువతిపై ద్వేషం ఎందుకు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 March 2026 8:00 PM IST
Nara Lokesh: వైఎస్ జగన్ పై మంత్రి లోకేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
X

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ తన ట్వీట్‌ లో జగన్‌ను ఉద్దేశించి “అభివృద్ధి వ్యతిరేకి జగన్ మళ్లీ రంగంలోకి వచ్చారు” అంటూ వ్యాఖ్యానించారు. ముందుగా అమరావతి రాజధాని ప్రాజెక్టును వ్యతిరేకించారని, తర్వాత విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారని, అనంతరం ఉద్యోగాలు సృష్టించే ఐటీ అభివృద్ధి కేంద్రాలపై పిల్‌ లు వేసారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ హబ్‌పై కూడా వైసీపీ కోర్టును ఆశ్రయించిందన్నారు.

విశాఖలో ప్రతిపాదించిన గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI)గా భావిస్తున్నారని తెలిపారు. అలాంటి కీలక పెట్టుబడిని అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. “ఆంధ్రప్రదేశ్ యువత, రాష్ట్ర అభివృద్ధిపై ఈ ద్వేషం ఎందుకు?” అంటూ లోకేష్ ఘాటుగా ప్రశ్నించారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. “ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లిపోయింది.. అభివృద్ధి ఆగదు” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తిరుపతి ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి విశాఖలో ప్రతిపాదించిన గూగుల్ డేటా సెంటర్ కోసం భూకేటాయింపును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అభివృద్ధి – ప్రతిపక్షాల పాత్రపై చర్చ ప్రారంభమైంది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story