Nandyal: డ్రైవర్లకు తీపి కబురు.. అందుబాటులోకి వచ్చిన ఆర్‌ఓ ప్లాంట్

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చొరవతో లారీ డ్రైవర్ల కోసం ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభం. రూ. 2.40 లక్షలతో విజయ డైరీ సమీపంలో ఏర్పాటు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 24 March 2026 4:33 PM IST
Nandyal
X

Nandyal: డ్రైవర్లకు తీపి కబురు.. అందుబాటులోకి వచ్చిన ఆర్‌ఓ ప్లాంట్

నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలో లారీ డ్రైవర్లకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కలెక్టర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆధునిక ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

నంద్యాల పట్టణంలోని విజయ పాల డైరీ సమీపంలో రూ. 2.40 లక్షల వ్యయంతో గంటకు 1000 లీటర్ల సామర్థ్యం గల ఆర్‌ఓ ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

గత జనవరి 31న జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా డ్రైవర్లు తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణమే ప్లాంట్ మంజూరు చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయించారు.ఈ ప్లాంట్ ద్వారా లారీ, ఆటో డ్రైవర్లతో పాటు సమీప ప్రాంత ప్రజలకు కూడా శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. స్వచ్ఛమైన నీటి వినియోగంతో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించవచ్చని కలెక్టర్ తెలిపారు.

"ప్రజల ఆరోగ్య రక్షణ కోసం స్వచ్ఛమైన తాగునీరు అత్యంత అవసరం. ఈ ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా డ్రైవర్లతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఉపయోగం చేకూరుతుంది," అని కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు.ఈ ప్లాంట్‌లో ఆధునిక ఫిల్ట్రేషన్ సాంకేతికత, నిల్వ ట్యాంకులు, సురక్షిత పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేసిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ అభినందించారు.

ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభంతో లారీ, ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story