Nandyala: సాగునీటి సమస్యకు చెక్ అధికారులకు మంత్రి ఫరూక్ కీలక ఆదేశాలు

Nandyala: నంద్యాల జిల్లా కరిమద్దుల గ్రామ రైతుల సాగునీటి సమస్యపై మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ స్పందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 3:33 PM IST
Nandyala
X

Nandyala: సాగునీటి సమస్యకు చెక్ అధికారులకు మంత్రి ఫరూక్ కీలక ఆదేశాలు

నంద్యాల జిల్లా: కరిమద్దుల రైతుల సాగునీటి సమస్యపై మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ తక్షణ స్పందన.. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం కరిమద్దుల గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ తక్షణ స్పందన వ్యక్తం చేశారు.

సోమవారం నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కరిమద్దుల గ్రామ రైతులు, గ్రామస్తులు మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ పొలాలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సాగునీటి ఎద్దడి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల సమస్యలను విన్న వెంటనే స్పందించిన మంత్రి ఫరూక్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అనంతరం సాగునీటి శాఖ సీఈ కబీర్ భాష గారితో కూడా చర్చించి, క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. కరిమద్దుల గ్రామ రైతుల సాగునీటి సమస్యను అత్యంత త్వరగా పరిష్కరించి, పంటలకు అవసరమైన నీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మంత్రి తక్షణ స్పందనపై గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు ఈశ్వర్ రెడ్డి, రైతులు పూల చంద్రారెడ్డి, నాగ మల్లయ్య, శివారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story