Banaganapalli: పది విద్యార్థులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 'చల్లని' కానుక!
Banaganapalli: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Banaganapalli: పది విద్యార్థులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 'చల్లని' కానుక!
బనగానపల్లె (నంద్యాల): ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరా రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆరు కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం
బనగానపల్లె పట్టణంలోని మొత్తం ఆరు పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థులకు, వారి కోసం వేచి ఉండే తల్లిదండ్రులకు మంత్రి దంపతుల చొరవతో ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేలా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దంపతుల మానవత్వానికి ఇది నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. పరీక్షలు ముగిసే వరకు అన్ని కేంద్రాల వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని మంత్రి అనుచర వర్గం తెలిపింది.




