Mulapeta Port: మూలపేట పోర్టుకు వెళ్లడానికి భయమెందుకు?
Mulapeta Port: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
Mulapeta Port: మూలపేట పోర్టుకు వెళ్లడానికి భయమెందుకు?
Mulapeta Port: కోటబొమ్మలి మండలం N.T.R పింఛను హామీ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు, సోమవారం వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర నాయకులు ఏర్పాటు చేసిన "పోర్టుకు పోదాం రండి" సభపై విమర్శలు చేసిన మంత్రి అచ్చం నాయుడు.
మూలపేట పోర్టు చూసేందుకు 40 మందికి అనుమతిచ్చాం ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నించారు. మళ్లీ వెళ్తామంటే అనుతిస్తాం కల్లుకి కనిపించకపోతే భూతద్దాలు కూడా పంపిణీ చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. "పోర్టు కి పోదాం రండి" కార్యక్రమం కి మూడు జిల్లాల నుంచి వచ్చిన నాయకులపై ఉత్తరాంధ్ర ఉద్దండులుగా వచ్చారు విమర్శలు గుప్పించిన అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్ర ఉద్దండులు మంటూ చెప్పుకుంటున్న సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బోత్స సత్యనారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు బిల్లు పార్లమెంట్‌కు పంపించాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
నేడే పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెడుతున్నామంటూ తెలిపారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు అంటూ అసహనం వ్యక్తం. రాష్ట్ర రాజధాను విభజనపై అవగాహన లేనివారు డొల్లతనంగా మాట్లాడుతున్నారు. జగన్ కారణంగా దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది అంటూ అసహనం వ్యక్తం.
జగన్ జంగిల్‌రాజ్ పాలన వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో జగన్ ప్రజలను మోసం చేశారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన, చేనేత, మరమగ్గాలున్న వారికి నేటి నుంచి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు,
చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సీఎం నారా చంద్రబాబు 22 నెలల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తున్నారు, వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సూపర్ సిక్స్ అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పింది జగనే అంటూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వంలో కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో 75 శాతం పనులు పూర్తి చేశాం అంటూ ఈ సందర్భంగా తెలిపారు.




