Cheepurupalli: ఇంటింటికీ కిమిడి.. అభివృద్ధి పథకాలను వివరిస్తూ పర్యటన.

Cheepurupalli: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు గారు అగ్రహారంలో పర్యటించి, అనకాపల్లిలో శంకుస్థాపన జరగనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశేషాలను ప్రజలకు వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 11:13 AM IST
Cheepurupalli
X

Cheepurupalli: ఇంటింటికీ కిమిడి.. అభివృద్ధి పథకాలను వివరిస్తూ పర్యటన.

చీపురుపల్లి: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి మరియు చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకట రావు ఈరోజు చీపురుపల్లిలోని అగ్రహారంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమైన ఆయన, రాబోయే భారీ ప్రాజెక్టుల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.

అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన:

ఈ నెల 23వ తేదీన అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయనున్న "ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్" గురించి ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అని ఆయన పేర్కొన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు:

ఈ సందర్భంగా కళావెంకట రావు గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ కొత్త స్టీల్ ప్లాంట్ ద్వారా యువతకు, కార్మికులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story