Kurnool: కైరుప్పల పిడకల సమరం.. హోరాహోరీగా సాగనున్న యుద్ధం!
Kurnool: ఉగాది పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో శతాబ్దాల నాటి వినూత్న సంప్రదాయం ‘పిడకల సమరం’ రేపు జరుగనుంది.
Kurnool: కైరుప్పల పిడకల సమరం.. హోరాహోరీగా సాగిన యుద్ధం!
కర్నూలు: ఉగాది పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామంలో శతాబ్దాల నాటి వినూత్న సంప్రదాయం ‘పిడకల సమరం’ రేపు జరుగనుంది. భక్తజన సందోహం నడుమ సాగే ఈ విలక్షణ క్రీడను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా జనం పాల్గొంటారు.
రెడ్డి రాజుల రాకతోనే ఆరంభం
ఆలయ సంప్రదాయం ప్రకారం.. పిడకల సమరం ప్రారంభానికి ముందు ఒక విశిష్ట ఘట్టం ఆవిష్కృతమవుతుంది. పొరుగున ఉన్న కారుమంచి గ్రామం నుంచి రెడ్డి కుటుంబ సభ్యులు గుర్రంపై ఊరేగింపుగా కైరుప్పలకు చేరుకుంటారు. వీరిని రెడ్డి రాజుల ప్రతినిధులుగా భావిస్తారు. వారు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గ్రామంలో అసలు పోరు మొదలవుతుంది.
భక్తితో కూడిన ‘పిడకల యుద్ధం’
రెడ్డి రాజుల పూజలు ముగిసిన కొన్ని నిమిషాలకే గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం వారు వీరభద్ర స్వామి తరపున, మరో వర్గం భద్రకాళి అమ్మవారి తరపున నిలిచి ఒకరిపై ఒకరు పిడకలతో దాడి చేసుకుంటారు. ఈ వింత పోరు కొన్ని తరాలుగా నిరాటంకంగా సాగుతుండటం విశేషం. ఈ సమరం ముగిసిన అనంతరం తెల్లవారుజామున శ్రీ భద్రకాళి, వీరభద్ర స్వామి వార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
త్రిమూర్తులు కొలువైన పుణ్యక్షేత్రం
కైరుప్పల ఆలయానికి మరో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ ఒకే ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (త్రిమూర్తులు) విగ్రహ రూపంలో కొలువై ఉండటం అత్యంత అరుదైన విషయం.
పురాణ గాథ: త్రేతాయుగంలో ఇది బ్రాహ్మణులు నివసించే అగ్రహారంగా ఉండేదని, కాలక్రమేణా ‘కైరుప్పల’గా మారిందని చెబుతారు. శివుని కోరిక: తన కుమారుడైన వీరభద్రుని కోసం పరమశివుడు స్వయంగా బ్రహ్మ, విష్ణువులను ఒప్పించి, వారి సమక్షంలోనే వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్ల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించినట్లు ఆలయ పురాణం వివరిస్తోంది.




