Rajampet: భార్య ఉరేసుకుంటుంటే.. నవ్వుతూ వీడియో తీసిన భర్త.. చివరకు ఏమైందంటే?

Rajampet: కళ్లెదుటే భార్య ప్రాణాలు విడుస్తున్నా, అది కేవలం తనను బెదిరించడానికే చేస్తున్న డ్రామా అని భావించిన ఒక భర్త అత్యుత్సాహం.. చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

Arun Chilukuri
Published on: 14 March 2026 11:26 AM IST
Rajampet: భార్య ఉరేసుకుంటుంటే.. నవ్వుతూ వీడియో తీసిన భర్త.. చివరకు ఏమైందంటే?
X

Rajampet: భార్య ఉరేసుకుంటుంటే.. నవ్వుతూ వీడియో తీసిన భర్త.. చివరకు ఏమైందంటే?

Rajampet: కళ్లెదుటే భార్య ప్రాణాలు విడుస్తున్నా, అది కేవలం తనను బెదిరించడానికే చేస్తున్న డ్రామా అని భావించిన ఒక భర్త అత్యుత్సాహం.. చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడాల్సింది పోయి, నవ్వుతూ వీడియో తీసిన భర్త ఉదంతం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపుతోంది.

ఘటన వివరాలు:

పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన శ్రీరాం శ్రీనివాసులు రైల్వేలో లోకోపైలట్‌గా పనిచేస్తున్నాడు. 2016లో నందలూరు మండలానికి చెందిన కృష్ణవేణి(30)ని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వీరు రాజంపేట మండలం బోయనపల్లిలో నివసిస్తున్నారు. అయితే శ్రీనివాసులుకు ఉన్న మద్యపానం అలవాటు కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన కృష్ణవేణి గత ఆరు నెలలుగా తాను చనిపోతానని చెబుతూ వచ్చేది.

బెదిరింపు అనుకొని వీడియో తీస్తూ..

గురువారం మరోసారి గొడవ జరగడంతో కృష్ణవేణి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకునే ప్రయత్నం చేసింది. కిటికీలోంచి ఇది గమనించిన శ్రీనివాసులు.. ఆమె తనను బెదిరించడానికే ఇలా చేస్తోందని భావించాడు. భార్యను ఆపకపోగా, మొబైల్‌లో వీడియో తీస్తూ "కృష్ణా.. సరిగ్గా ఉరేసుకో" అంటూ నవ్వుతూ వ్యాఖ్యలు చేశాడు.

వీడియో తీస్తున్న క్రమంలోనే కృష్ణవేణి ఒక్కసారిగా మంచం మీద నుండి దిగడంతో మెడకు ఉచ్చు బిగుసుకుంది. అది చూసి షాక్‌కు గురైన శ్రీనివాసులు వెంటనే తలుపులు తీసే ప్రయత్నం చేసినా గడియ రాకపోవడంతో కేకలు వేశాడు. స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేలోపే కృష్ణవేణి మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story