Pattikonda: పత్తికొండలో గ్యాస్ కొరత సామాన్యుడికి తప్పని తిప్పలు!

Pattikonda: పత్తికొండలో గ్యాస్ సిలిండర్ల కొరతపై వినియోగదారుల ఆందోళన. గృహ సిలిండర్లు హోటళ్లకు మళ్లుతుండటంతో సామాన్యులకు తప్పని తిప్పలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 24 March 2026 1:21 PM IST
Pattikonda
X

Pattikonda: పత్తికొండలో గ్యాస్ కొరత సామాన్యుడికి తప్పని తిప్పలు!

Pattikonda: పత్తికొండ గ్యాస్ సిలిండర్ల కొరతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, సరఫరా పరిస్థితులపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు గ్యాస్ కొరత లేదని, అవసరానికి సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, స్థానికంగా కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండలంలోని పలు ప్రాంతాల్లో చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్సైడ్ బంకుల్లో గృహ వినియోగ సిలిండర్లు వినియోగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా రమర్షియల్ అవసరాలకు వేరు సిలిండర్లు బినియోగించాల్సి ఉన్నప్పటికీ, గృహ సిలిండర్ల వినియోగం జరుగుతోందన్న చర్చ విస్తృతంగా వినిపిస్తోంది.

అధికారులు కమర్షియల్ అవసరాలకు అదనపు కోటా కేటాయించినట్లు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం పలు హోటళ్లలో గృహ సిలిండర్లు వినియోగం జరుగుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు గ్యాస్ సరాలంలో అందరపోవడం సహజమని వారు అభిప్రాయపడుతున్నారు. పత్తికొండ లోని పలు గ్రామాల్లో గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత కూడా రోజులు గడిచినా సిలిండర్లు.

అందకపోవడం గమనార్హంగా మారింది. గ్యాస్ ఏకెన్సీలను సంప్రదించినప్పటికీ స్పష్టత లభించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు ప్రధాన దారణం తనిఖీల లోపమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. గృహ సిలిండర్ల వినియోగం నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందా లేదా అన్న దానిపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత, క్రమబద్ధత కోసం సంబంధిత శాఖలు వెంటనే స్పందించి వినియోగంపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

గృహ వినియోగదారులకు సరాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story