Devanakonda: ఎన్నికల హామీలు ఏమాయ్యాయి? దేవనకొండలో ప్రభుత్వంపై ధ్వజం

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండలో సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. నిరుపేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం అందించాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 6:51 PM IST
Devanakonda
X

Devanakonda: ఎన్నికల హామీలు ఏమాయ్యాయి? దేవనకొండలో ప్రభుత్వంపై ధ్వజం

Devanakonda: దేవనకొండ అర్హులైన పేదలకు ఇల్లు, ఇల్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణ వ్యయాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచి ఇవ్వాలని, అర్హులైన లబ్ధిదారులకు వికలాంగ, వితంతు, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు డిమాండ్ చేశారు.

మంగళవారo సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు దేవనకొండలో సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి వి.రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.

పట్టణంలో రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలోని యన్డిఏ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన సెంటున్నార స్థలాలు నిరుపేదలకు సరిపోదని అందుకే ప్రతి నిరుపేదకు మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదలకు ఇండ్లు మంజూరు చేసి వాటికీ రు, 5 లక్షలు కేటాయించాలన్నారు. ఇంటి స్థలాల హామీని అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు దరఖాస్తు చేసిన వారందరికి ఇండ్ల పట్టాలు మంజూరు చెయ్యాలన్నారు. అనంతరం తహసీల్దార్ సుదర్శన్ కి వినతిపత్రం సమర్పించారు.

కార్యక్రమంలో కార్యక్రమంలో కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తిమ్మప్ప కొండప్ప సిపిఐ మండల నాయకులు శేఖర్ కృష్ణ మధు రవి మద్దిలేటి హరిచంద్ర జహంగీర్ వీరస్వామి నరేష్ రఫీ రాము మిన్నయ్య ఆచారి వీరన్న తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story