CM Chandrababu: పుష్కరాల లోపే పోలవరం పూర్తి.. అమరావతి వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన!
CM Chandrababu: ఆంధ్ర రాష్ట్ర సాధకుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల కఠోర దీక్షకు నిదర్శనంగా రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు.
CM Chandrababu: పుష్కరాల లోపే పోలవరం పూర్తి.. అమరావతి వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన!
CM Chandrababu: ఆంధ్ర రాష్ట్ర సాధకుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల కఠోర దీక్షకు నిదర్శనంగా రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. శాఖమూరు వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
విగ్రహం ప్రత్యేకతలు:
ఎత్తు: 58 అడుగులు (58 రోజుల దీక్షకు గుర్తుగా).
సామగ్రి: 26 టన్నుల కాంస్యం (Bronze), 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగం.
ప్రాధాన్యత: రాజధాని అమరావతికి ఈ విగ్రహం ఒక తలమానికంగా నిలవనుంది.
గత పాలనపై విమర్శలు.. రాజధాని పునర్నిర్మాణంపై స్పష్టత
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "మూడు రాజధానుల పేరిట గత పాలకులు అసలు రాజధానే లేకుండా చేశారు. అమరావతిని ఎడారి అని, శ్మశానం అని అవహేళన చేశారు. కానీ రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారు" అని గుర్తు చేశారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిన గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికే కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు.
పోలవరంపై కీలక ప్రకటన
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సీఎం కీలక ప్రకటన చేశారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో సమష్టిగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధిస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటామని వెల్లడించారు.




