Gokavaram: దేశమే ప్రథమం.. పార్టీయే ముఖ్యం గోకవరంలో బిజెపి నేతల గర్జన


Gokavaram: దేశమే ప్రథమం.. పార్టీయే ముఖ్యం గోకవరంలో బిజెపి నేతల గర్జన
Gokavaram: గోకవరంలో బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మంగరాజు పార్టీ జెండాను ఆవిష్కరించి, సిద్ధాంతాలను వివరించారు.
Gokavaram: భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి బిజెపి జండా స్తూపం వద్ద గోకవరం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు బిజెపి సీనియర్ నాయకులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరము కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మట్ట మంగరాజు, మండల బిజెపి అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర, బిజెపి సీనియర్ నాయకుడు ఉంగరాల ఆదివిష్ణు, మాట్లాడుతూ బిజెపి సైద్ధాంతిక బలం కలిగిన పార్టీ అని దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పనిచేసే వేలాదిమంది నాయకులు కలిగిన పార్టీ అని,
నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, అంటే దేశానికి ప్రథమ ప్రాధాన్యత పార్టీకి రెండో ప్రాధాన్యత వ్యక్తిగతానికి మూడవ ప్రాధాన్యత ఇచ్చే లక్షలాదిమంది కార్యకర్తలు కలిగిన పార్టీ బిజెపి అని, భారతదేశంలో అతిపెద్ద పార్టీ బిజెపి అని, అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బిజెపి అని, అత్యధిక రోజులు ప్రధాని పదవిని నిర్వహిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందని ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా విశ్వగురుగా నిలబెట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బిజెపి అజెండాలోని మూడు ముఖ్యాంశాలలో ఇప్పటికే రెండు పూర్తి చేయడం జరిగిందని అవి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణము, కాశ్మీర్ లో 370 అధికరణము రద్దు, ఇప్పటికే పూర్తయ్యాయని ఇక ఉమ్మడి పౌరస్మృతి కూడా అమలులోకి తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని,
ఒక ఛాయ్ వాలా కూడా ప్రధానమంత్రి పదవిని అధిష్టించే అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుందని, ఒక సన్యాసి కూడా అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బిజెపిలో మాత్రమే ఉంటుందని, బిజెపిలో వారసత్వం ఉండదని, అనువంశిక పాలన ఉండదని, సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి ఎదగగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్తి వెంకటరెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు రైల్వే బోర్డు నెంబర్ బత్తుల వెంకన్న బాబు,
జిల్లా బిజెపి కార్యదర్శి కోన వెంకట సురేష్, తామర్ల రాంబాబు,మండల బిజెపి ప్రధాన కార్యదర్శి ముప్పిడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు దాసరి నరసింహారావు, కోశాధికారి ముమ్మిడివరపు రామకృష్ణ, మామిడి వీర వెంకట సత్యనారాయణ, పీతా సత్యనారాయణ, మార్గాని వెంకటేష్, పిల్లా సత్యనారాయణ, పిల్లా గంగాధరం, సబ్బిళ్ళ రామారెడ్డి, అడపా సతీష్, నరాల శెట్టి తాతయ్యలు,తదితరులు పాల్గొన్నారు

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

