Banaganapalle: ఖాళీ సిలిండర్లతో పడిగాపులు.. తీరని గ్యాస్ కష్టాలు!

Banaganapalle
x

Banaganapalle: ఖాళీ సిలిండర్లతో పడిగాపులు.. తీరని గ్యాస్ కష్టాలు!

Highlights

Banaganapalle: బనగానపల్లెలో భారత్ గ్యాస్ వినియోగదారుల అవస్థలు. బాలాజీ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం, అదనపు వసూళ్లు.

Banaganapalle: బనగానపల్లె పట్టణంలోని భారత్ గ్యాస్ నిర్వాహకులు బాలాజీ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ వారి భారత్ గ్యాస్ బుక్ చేసిన ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయకపోవడంతో బనగానపల్లె పట్టణంలో బాలాజీ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ కేంద్రాల వద్ద ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు.

ప్రతిరోజు సిలిండర్లు తీసుకొని వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నామని వినియోగదారులు అంటున్నారు ఫిబ్రవరి 4వ తేదీన బుక్ చేసి మార్చి 4, 25 వ తేదీలలో డెలివరీ అయినట్లు మొబైల్ కి మెసేజ్ లు వచ్చాయని బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు నెలరోజుల నుండి తిరుగుతున్నామని మహిళలు మీడియాకు తెలిపారు.

మూడు కిలోమీటర్ల పరిధిలో ఫ్రీ సర్వీసెస్ ఇవ్వకుండా బనగానపల్లె బాలాజీ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ వారి భారత్ గ్యాస్ అదనంగా 50 రూపాయలు తీసుకుంటున్నారని మహిళలు ఆరోపించారు. గత నెల రోజుల నుండి స్టాక్ వస్తుంది వచ్చిన తర్వాత ఇస్తామని చెబుతున్న నిర్వాహకులు.

ఒక నెలలో మూడు సిలిండర్లు తీసుకున్నట్లు మొబైల్ కు మెసేజ్లు వచ్చినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గ్యాస్ కష్టాలు తొలగించాలని బనగానపల్లె పట్టణ ప్రజలకు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories