AP Weather Alert: రాగల 3 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు!

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Arun Chilukuri
Published on: 18 March 2026 5:28 PM IST
AP Weather Alert
X

AP Weather Alert: రాగల 3 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు!

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పిడుగుల హెచ్చరిక ఉన్న జిల్లాలు:

విపత్తు నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం.. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బయట ఉన్న వారు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని అధికారులు హెచ్చరించారు.

గన్నవరంలో ఈదురుగాలులు - విమానం మళ్లింపు:

మరోవైపు, విజయవాడ గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం భారీ గాలుల వల్ల రన్‌వేపై దిగలేకపోయింది. దీంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించారు. వాతావరణం కుదుటపడిన తర్వాతే విమాన సర్వీసులు పునఃప్రారంభం అవుతాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story