AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. రాజధాని అభివృద్ధిపై భారీ నిర్ణయాలు!

AP Cabinet Meeting: అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహించనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 March 2026 11:11 AM IST
AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. రాజధాని అభివృద్ధిపై భారీ నిర్ణయాలు!
X

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. రాజధాని అభివృద్ధిపై భారీ నిర్ణయాలు!

AP Cabinet Meeting: అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, భూకేటాయింపులు, నిర్మాణ పనులు, పరిపాలనా నిర్ణయాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఆర్డీఏ అథారిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో కేంద్ర విద్యా సంస్థలకు సౌకర్యాలు కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం 80 సెంట్ల భూమిని కేటాయించే ప్రతిపాదన క్యాబినెట్ ముందుకు రానుంది. ఈ కార్యాలయం ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లోని సీబీఎస్ఈ పాఠశాలలకు పరిపాలనా పనులు మరింత సులభం అవుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ భూకేటాయింపుకు పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల భూమి కేటాయింపుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదే సమావేశంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఏపీఎస్ఐఆర్డీ)కు 5 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చ జరగనుంది. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భూమిని వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇక అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక భాగమైన సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ భవనాల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2316 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది. అలాగే అమరావతిలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఒక తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి రూ.119 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపే అంశం కూడా క్యాబినెట్ పరిశీలనలో ఉంది.

క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందన్న అంశం, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితి వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో నేటి క్యాబినెట్ సమావేశం రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలకు వేదిక కానుందని అధికారులు చెబుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story