ఏపీలో పెరిగిన పెట్రోల్ విక్రయాలు.. భారీగా పెరిగిన ఇండస్ట్రియల్ డీజిల్ ధర!

AP Petrol Sales Hike: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Arun Chilukuri
Published on: 24 March 2026 2:32 PM IST
AP Petrol Sales Hike
X

ఏపీలో పెరిగిన పెట్రోల్ విక్రయాలు.. భారీగా పెరిగిన ఇండస్ట్రియల్ డీజిల్ ధర!

AP Petrol Sales Hike: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ధరల మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ డీజిల్ ధరలో భారీ వ్యత్యాసం చోటుచేసుకోగా, సాధారణ వినియోగదారులపై కూడా ఆ ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా మార్పుల ప్రకారం, ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటర్‌కు ఏకంగా 27 రూపాయలు పెరిగింది. మరోవైపు, నాణ్యత కలిగిన బ్రాండెడ్ పెట్రోల్‌పై కూడా లీటర్‌కు 2 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అకస్మాత్తు పెంపుతో పారిశ్రామిక రంగంపై పెను భారం పడనుంది.

ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి ఇబ్బంది లేదని, పెట్రోల్ బంకుల్లో కొరత లేదని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెట్రోల్ సరఫరాలో అంతరాయం కలిగి, కొరత ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా చాలా మంది వాహనదారులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు.

పెట్రోల్ దుర్వినియోగం కాకుండా మరియు భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. కేంద్ర ఆదేశాల మేరకు బంకుల్లో బాటిల్స్ లేదా డబ్బాల్లో పెట్రోల్ పోయడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపుతున్నామని, నిబంధనలను అతిక్రమించే ప్రసక్తే లేదని వెల్లడించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story