భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా యువత ఏకం కావాలి

కర్నూలు జిల్లా దేవనకొండలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల 95వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 5:49 PM IST
Shaheed Diwas
X

భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా యువత ఏకం కావాలి

Kurnool: దేశం కోసం 23 సంవత్సరాల వయసులో ప్రాణాన్ని బలిదానం చేసిన అమరులు భగత్ సింగ్ రాజ్ గురు, సుఖదేవ్ ల స్ఫూర్తితో దేశంలో రాజ్యమేలుతున్న కార్పొరేటు ,అవినీతి, మత రాజకీయాలపై పోరాడుదామని, అందుకు యువత విస్తృత పోరాటాలకు రావాల్సి న అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి ముక్కెల్ల అశోక్ , డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కే శ్రీనివాసులు యువతను కోరారు.

భగత్ సింగ్, రాజ గురు, సుఖదేవ్ 95వ వర్ధంతి సందర్భంగా దేవనకొండ మండల కేంద్రంలోను, కోటకొండ, తెర్నేకల్, కుంకునూరు గ్రామాలలో అమరులైన భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ లకు నివాళి అర్పించారు. డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు వై మహేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అనేకమంది తమ ప్రాణాలను పనంగా పెట్టారని వారిలో దేశ స్వాతంత్ర సమరంను విప్లవం వైపు నడిపిన వీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లని వారు పేర్కొన్నారూ భగత్ సింగ్ సుఖదేవ్, రాజ్ గురు 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారని వారి పోరాటం కేవలం బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై మాత్రమే కాదు సమాజంలో ఉన్న అన్యాయం, దోపిడి, మతోన్మాదం, మూఢనమ్మకాలపైన వారి పేర్కొన్నారు.

సామ్రాజ్యవాదం అనేది మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ అని నేడు కొత్త రూపాల్లో అదే సామ్రాజ్యవాదం తిరిగి పెట్రేగిపోతోందాని పేర్కొన్నారు,కార్పొరేట్ శక్తులు దేశ సంపదను కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరిస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు లేకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా, కార్మికులకు శ్రమకి తగ్గ వేతనం, భద్రత లేకుండా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు యువతను దారి మళ్ళిస్తున్న అతి పెద్ద ప్రమాదమే డ్రగ్స్, నిరుద్యోగం, నిరాశ, ఆర్థిక అసమానతలు ఇవన్నీ కలసి యువతను మత్తు పదార్థాల వైపు నెడుతున్నాయనీ అన్నారు, చైతన్యవంతమైన యువతను బలహీనపరచడానికి పనిచేసే ఒక సామాజిక ఆర్థిక కుట్ర యువత పోరాట పంథాను విడిచిపెట్టి మత్తులో మునిగితే, దోపిడీ వ్యవస్థకు ఎలాంటి ప్రతిఘటన ఉండదనీ కార్పొరేట్ మతశక్తుల ఆలోచనగా ఉందని వారి పేర్కొన్నారు

మతతత్వం కూడా యువతను మోసం చేసే ఆయుధాలే నని భగత్ సింగ్ స్పష్టంగా మతతత్వాన్ని వ్యతిరేకించారనీ పేర్కొన్నారు.

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఇవి హక్కులుగా మారాలనీ యువతకు ఉద్యోగ హామీ, రైతుకు గిట్టుబాటు ధర, కార్మికునికి పనికి తగ్గ వేతనం, భద్రత ఇవన్నీ సోషలిస్టు విధానంలోనే సాధ్యమని వారి పేర్కొన్నారు, భగత్ సింగ్ పేర్కొన్నట్లు సంపూర్ణ ఆర్థిక, రాజకీయ, సామాజిక భారతమే యువత లక్ష్యంగా ఉండాలని వారు పేర్కొన్నారు అనంతరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ నిర్వహించారు కార్యక్రమంలో యూసుఫ్ భాష, వీరేంద్ర నాయుడు, రంగన్న, పాండురంగడు, పెద్దయ్య, రామాంజనేయులు, బలరాముడు, మధు, రంగడు, రాము, పెద్దయ్య, చిన్న రాయుడు, అనిల్ కుమార్, నాగేంద్ర, మహబూబ్ భాషా, సుధాకర్ ,రవీంద్ర, బజారి ,పరమేష్ దొడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story