logo
తెలంగాణ

Nizamabad: యువీ పెద్ద మనసు.. ఒకేసారి రికార్డు స్థాయిలో సహాయం..

Yuvraj Singh Donates Critical Care Units for Nizamabad Hospital
X

Nizamabad: యువీ పెద్ద మనసు.. ఒకేసారి రికార్డు స్థాయిలో సహాయం..

Highlights

Nizamabad: క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనస్సు చాటుకున్నారు.

Nizamabad: క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనస్సు చాటుకున్నారు. తన పౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి 2.5 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు సమకూర్చారు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా ఆసుపత్రిలో 120 ఐసీయూ బెడ్స్ ఏర్పాటుకు యువరాజ్ సింగ్ ముందుకొచ్చారు.

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి దేశ స్దాయిలో గుర్తింపు సాధించింది. కోవిడ్ సమయంలో కరోనా పేషెంట్స్ కు వైద్య సిబ్బంది చేసిన సేవలను క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తించారు. మరింత మెరుగైన వైద్యం అందిచేందుకు వీలుగా తన పౌండేషన్ తరపున 2.5 కోట్లు విలువ చేసే 120 ఐసీయూ బెడ్స్ అందచేశారు. ఈ మేరకు యూవీకేన్ పౌండేషన్ సభ్యులు జిల్లా ఆసుపత్రిలోని రెండు వార్డులలో ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేశారు.

క్రికెటర్ యువరాజ్ సింగ్ మిషన్ థౌజండ్ బెడ్స్ పేరుతో దేశ వ్యాప్తంగా సర్కారు ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రి వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలు జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్ బెడ్స్ ఏర్పాటు ఆవశ్యకతపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకుని యూవీకెన్ పౌండేషన్ ప్రతినిధులతో పలు మార్లు చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ కవిత చొరవతో క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనస్సు చాటుకుని జిల్లా ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా ఐసీయూ బెడ్స్ అందించారు.

ఒకేసారి రికార్డు స్దాయిలో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ అందుబాటులోకి రావడంతో కార్పొరేట్ వైద్యం నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు ఉచితంగా అందనుంది. 10 ఏళ్ల వరకు పనికొచ్చేలా నాణ్యమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని యూవీకెన్ పౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది చేసిన సేవలకు దేశ స్దాయిలో గుర్తింపు వచ్చింది. వైద్య సిబ్బంది చేసిన సేవలే క్రికెటర్ యువరాజ్ సింగ్ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. జిల్లాకు చెందిన యూవీకెన్ పౌండేషన్ ప్రతినిధులు చొరవ తీసుకోవడం ఫలితాలనిచ్చింది. 120 బెడ్లను ఈనెల 28న అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు.

Web TitleYuvraj Singh Donates Critical Care Units for Nizamabad Hospital
Next Story