పోలీసులపై యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఫైర్

X
Tejasvi Surya (file image)
Highlights
పోలీసులపై యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఫైర్
Arun Chilukuri24 Nov 2020 1:45 PM GMT
ఓయూలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహణతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓయూలో రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, బీజేవైఎం కార్యకర్తలు బారికేడ్లను తొలగించి ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించేదుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణలో యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని తెలిపారు.
Web TitleYuva Morcha National President Tejaswi Surya fires on Police
Next Story