YSRTP: రేపు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రెస్ మీట్

పార్టీ ప్రకటన తర్వాత మొదటిసారిగా మీడియా సమావేశం అక్బోబర్ లో నిర్వహించే పాదయాత్రపై ప్రకటన చేసే అవకాశం

Sandeep Reddy
Published on: 15 July 2021 6:03 PM IST
YSRTP President YS Sharmila Press Meet Tomorrow 16 07 2021 in Hyderabad
X

YSRTP: రేపు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రెస్ మీట్

YSRTP: వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు. పార్టీ జెండా, పేరు, అజెండా ప్రకటించిన తర్వాత ఆమె రేపు మీడియాతో మాట్లాడనున్నారు షర్మిల రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెంబర్ షిప్ డ్రైవ్, అక్టోబర్ లో పాదయాత్ర పై ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి పలు అంశాలపై స్పందిస్తున్న షర్మిల ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వస్తున్నారు. ధర్నాలు, దీక్షలు చేపట్టారు. ఇక, పార్టీ పేరు ప్రకటించిన తర్వాత పార్టీ నిర్మాణంపై కూడా దృష్టిసారించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story