YS Sharmila: బంగారు తెలంగాణ అప్పులపాలు.. మాట నిలబెట్టుకోలేని కేసీఆర్‌ను దొంగ.. మోసగాడు అనాలి

YS Sharmila: తెలంగాణ సంపద కొల్లగొట్టి జాతీయ పార్టీ ఏర్పాటు

Rama Rao
Published on: 17 Oct 2022 2:17 PM IST
YSRTP Chief YS Sharmila Comments on CM KCR | TS News
X

YS Sharmila: బంగారు తెలంగాణ అప్పులపాలు.. మాట నిలబెట్టుకోలేని కేసీఆర్‌ను దొంగ.. మోసగాడు అనాలి

YS Sharmila: బంగారం లాంటి తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేశాడని, మాట నిలబెట్టుకోని కేసీఆర్‌ను దొంగ అనాలని, మోసగాడు అనాలని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. తెలంగాణ సంపద కొల్లగొట్టి జాతీయ పార్టీ పెట్టాడని ఆరోపించారు. షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రాజెక్టుల పేరు చెప్పి లక్ష కోట్ల కమీషన్లు తిన్నాడని, ఆ డబ్బుతోనే విమానాలు కొంటున్నాడని తీవ్ర పదజాలంతో విమర్శించారామె బంగారు తెలంగాణలో కేసీఆర్ తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు.

వైఎస్ ఆర్ పథకాలన్నింటినీ బంద్ చేశాడని, ఆరోగ్య శ్రీ పథకాన్ని కోమాలో పెట్టాడని, ఉచిత ప్రయివేటు వైద్యం కలగా మిగిలిపోయిందన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించాడని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలన పోవాలని, వైఎస్ ఆర్ సంక్షేమ పాలన మళ్లీ రావాలని, వైఎస్ ఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని తెలంగాణలో మళ్లీ అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని ఆమె అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story