YS Sharmila: తెలంగాణలో తాలిబిన్ పాలన కొనసాగుతోంది

YS Sharmila: ఇక్కడి ప్రజల మనోభావాలను ప్రభుత్వం గుర్తించడం లేదు

Rama Rao
Published on: 10 Oct 2022 5:34 PM IST
YSRTP Chief YS Sharmila Comments on CM KCR | TS News
X

YS Sharmila: తెలంగాణలో తాలిబిన్ పాలన కొనసాగుతోంది

YS Sharmila: తెలంగాణలో తాలిబాన్ పాలన కొనసాగుతోందన్నారు YSRTP అధినేత్రి షర్మిల. తన ప్రజాప్రస్తాన యాత్రలో భాగంగా ఉమ్మడి నిజమాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా వద్ద 2500km మైలు రాయి దాటిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఈప్రాంత ప్రజలకు మేలుచేసిన మహనీయుడు వైఎస్సార్ అన్న ఆమె హజీపుర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను సీఎం అయ్యాక ఈ హజీపూర్‎లో YSR విగ్రహం పెట్టి తీరుతామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story