కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ బాగుపడలేదన్న వైఎస్ షర్మిల

YS Sharmila: పథకాల పేరుతో మోసం చేశారని మండిపాటు

Rama Rao
Published on: 25 Sept 2022 1:48 PM IST
YSRTP Chief YS Sharmila Comments on CM KCR | TS News
X

కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ బాగుపడలేదన్న వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ బాగు పడలేదని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పథకాల పేరు చెప్పి కేసీఅర్ చేసింది మోసమని ఆరోపించారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో తినే తిండి, పీల్చే గాలి మీద పన్ను వేస్తాడని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేక వందల మంది బిడ్డలు చనిపోతే రూపాయి కూడా సహాయం చేయలేదని అన్నారు. పాదయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగర్ పల్లి గ్రామంలో షర్మిలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కావాలని కోరుకుంటున్న ప్రతి ఇంటిపై జెండా ఎగరాలని షర్మిల సూచించారు.



Rama Rao

Rama Rao

Next Story