YS Sharmila: పరిగి, తోండుపల్లికి చేరుకున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: 8 ఏళ్లుగా సీఎం పరిగి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శ

Rama Rao
Published on: 21 Sept 2022 3:22 PM IST
YSRTP Chief YS Sharmila Comments on CM KCR | TS News
X

YS Sharmila: పరిగి, తోండుపల్లికి చేరుకున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: ప్రజా సమస్యలపై గళమెత్తిన వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. పరిగి నియోజకవర్గం, తోండుపల్లికి చేరుకున్న పాదయాత్రలో ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 8 ఏళ్లుగా పరిగి ప్రజలను సీఎం మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి పరిగికి నీళ్ళు ఇస్తామని చెపుతూ పరిగి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. కేసీఅర్ హామీ ఇచ్చిన ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. ఎన్నికల సమయంలోనే బయటకొచ్చే సీఎం కేసిఆర్ కి ప్రజలంటే కేవలం ఓట్లు మాత్రమేనని అన్నారు. సంవత్సరంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story