YS Sharmila: ఈటల త‌మ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తాం -ష‌ర్మిల‌

Samba Siva Rao
Published on: 9 Jun 2021 7:06 PM IST
YsYs Sharmila Welcoms To Eetala
X

YS Sharmila File Photo

YS Sharmila: తెలంగాణ రాజ‌కీయాల్లో వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక శ్రేణులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో షర్మిల మాట్లాడుతూ..,ఈటల కేసులకు భయపడే బీజేపీలో చేరుతున్నారని ష‌ర్మిల అభిప్రాయప‌డ్డారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం పరిపాటి అయిపోయిందని మండిపడ్డారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు ఈటలతో తాము చర్చించలేదని అన్నారు. మరోవైపు వచ్చే నెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా తమ పార్టీని షర్మిల అధికారికంగా ప్రకటించబోతున్నారు.ష‌ర్మిలా పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా రిజిస్ట్రేష‌న్ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story