YS Sharmila: టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన షర్మిల

* మంజీరా నది ఇసుక గుంతల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు పరామర్శ * టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన షర్మిల

Shilpa
Updated on: 1 Oct 2021 6:32 PM IST
YS Sharmila Visited Kamareddy District
X

కామారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన(ఫోటో- ది హన్స్ ఇండియా)

YS Sharmila: మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు షర్మిల. మంజీరా నది ఇసుక గుంతల్లో చనిపోయిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించారు.

అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం నిప్పులు చెరిగిన షర్మిల రాష్ట్రంలో ఇసుక మాఫియాపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపద దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ దోపిడీ దొంగల తెలంగాణగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Shilpa

Shilpa

Next Story