YS Sharmila: అమరవీరుల త్యాగం..కల్వకుంట్ల వారి భోగం.. వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట..

YS Sharmila: సీఎం కేసీఆర్ కుటుంబంపై మరోసారి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 16 Jun 2023 4:30 PM IST
YS Sharmila Slams CM KCR in Twitter
X

YS Sharmila: అమరవీరుల త్యాగం..కల్వకుంట్ల వారి భోగం.. వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట..

YS Sharmila: సీఎం కేసీఆర్ కుటుంబంపై మరోసారి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట. దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాకుండెనట అంటూ షర్మిల సెటైర్లు వేశారు. ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట. ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే అంటూ నిలదీశారు. 1200 మంది అమరుల త్యాగాలపై రాజ భోగాలు అనుభవిస్తూ...రాష్ట్ర సంపదను పందికొక్కుల లెక్క దోచుకుతింటూ..ఉద్యమం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులను..సకల జనులను అవమానించడమే మీ సంస్కారమా? అని షర్మిల ట్విట్టర్‌లో ప్రశ్నించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story