మీడియా చిట్‌చాట్‌లో షర్మిల సంచలన వ్యాఖ్యలు.. విజయశాంతి, కేసీఆర్..

Arun Chilukuri
Published on: 24 Feb 2021 7:51 PM IST
మీడియా చిట్‌చాట్‌లో షర్మిల సంచలన వ్యాఖ్యలు.. విజయశాంతి, కేసీఆర్..
X

మీడియా చిట్‌చాట్‌లో షర్మిల సంచలన వ్యాఖ్యలు.. విజయశాంతి, కేసీఆర్..

మీడియా చిట్‌చాట్‌లో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే తనకు విజయమ్మ మద్దతు ఉందన్నారు. తాను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్న షర్మిల జగన్‌తో పార్టీ పరమైన విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జగన్ దగ్గర కూర్చుని గట్టిగా అడిగితే నేను కోరిన పోస్ట్ ఇవ్వడా అని ప్రశ్నించారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్న షర్మిల విజయశాంతి, కేసీఆర్ ఇక్కడివారా అని ప్రశ్నించారు. జగన్ అన్న లోటస్‌పాండ్ నుంచే గెలిచారన్న షర్మిల ఇక్కడి నుంచే తన ప్రస్థానం కూడా మొదలు అవుతుందన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గడప గడపకు వెళ్తానన్న షర్మిల త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story