YS Sharmila: మహిళలకు ఆస్తి హక్కు క‌ల్పించిన వ్య‌క్తి ఎన్టీఆర్ ఒక్క‌రే

YS Sharmila: నేడు నందమూరి తారకరామారావు 98వ జయంతి.

Samba Siva Rao
Published on: 28 May 2021 6:44 PM IST
YS Sharmila Responds on Sr NTR Birth Anniversary
X

వైఎస్ ష‌ర్మిల ఫైల్ ఫోటో

YS Sharmila: నేడు నందమూరి తారకరామారావు 98వ జయంతి. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు మ‌రోసారి ఆయ‌ను స్మ‌రించుకున్నారు. తాజాగా, దివంగత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ మేరకు ఓ పత్రికలో సంక్షేమంలో స్వర్ణయుగం అంటూ ఎన్టీఆర్ పై వచ్చిన కథనాన్ని కూడా ష‌ర్మిల‌ పంచుకున్నారు. నాడు పటేల్, పట్వారీ వ్యవస్థలను ఆయన రద్దు చేశారని కొనియాడారు. బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు, మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని షర్మిల కీర్తించారు. ముఖ్యంగా, రెండు రూపాయలకే కిలోబియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చారని స్మరించుకున్నారు. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story