YSRTP: వైఎస్‌ షర్మిల పార్టీ పేరు ఖరారు

YSRTP: వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 3 Jun 2021 8:40 PM IST
Ys Sharmila Registers Party Name As Ysr Telangana Party
X

వైఎస్ షర్మిల (ఫొటో ట్విట్టర్)

YSRTP: వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆమె పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాన్ని ప్రకటించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె పెట్టబోయే పార్టీ పేరు ఏంటనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా వైఎస్ షర్మిల పార్టీ పేరు బయటికి వచ్చింది. ఎన్నికల సంఘం వద్ద షర్మిల పార్టీ పేరును నమోదు చేయించారు. పార్టీ పేరును వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా రిజిస్టర్‌ చేయగా... ఈ పేరుపైనే ఈసీ రిజిస్టర్ చేసింది. ఈమేరకు తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. కాగా, వైఎస్సార్‌టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌గా పనిచేయనున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story