YS Sharmila: అందుకే కాంట్రాక్టులన్నీ కేసీఆర్ మేఘ కృష్ణారెడ్డికి ఇస్తారు..

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్, మేఘ కృష్ణారెడ్డి వ్యాపార భాగస్వాములని వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2022 2:53 PM IST
YS Sharmila Protest at Jalasoudha
X

YS Sharmila: అందుకే కాంట్రాక్టులన్నీ కేసీఆర్ మేఘ కృష్ణారెడ్డికి ఇస్తారు..

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్, మేఘ కృష్ణారెడ్డి వ్యాపార భాగస్వాములని వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఆరోపించారు. అందుకే రాష్ట్రంలోని కాంట్రాక్టులన్నీ ఆ కంపెనీకి ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమేనా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఓ బోగస్ ప్రాజెక్టన్నారు. హైదరాబాద్ జల సౌద వద్ద ధర్నా నిర్వహించిన షర్మిల తెలంగాణ చీఫ్ ఇంజనీర్ మురళిదర్ రావును కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story