వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా

Arun Chilukuri
Published on: 13 Feb 2021 4:53 PM IST
వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా
X

వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా

వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈనెల 21న ఖమ్మంలో ఆత్మీయ సమ్మెళనం నిర్వహించాలని షర్మిల భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మార్చి 14 తర్వాత వైఎస్ షర్మిల ఖమ్మం పర్యటన ఖరారు కానున్నట్లు సమాచారం. షర్మిల బెంగళూరు పర్యటన పరిణామాల తరువాతే ఖమ్మం టూర్ వాయిదా వేయడంపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే లోటస్‌పాండ్‌లో ప్రతి శుక్రవారం అభిమానులతో షర్మిల భేటీ కానున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా అభిమానులతో షర్మిల సమావేశాలు జరపనున్నారు. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులతో సమావేశమయ్యారు. పార్టీ ఏర్పాటుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సెంటిమెంట్‌లో భాగంగా ముందుగా చేవెళ్ల నేతలతో షర్మిల భేటీ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story