YS Sharmila: దీక్ష విరమించిన వైఎస్ షర్మిల

YS Sharmila: వైఎస్ షర్మిల దీక్ష విరమించారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలతో దీక్ష విరమింపజేశారు.

Samba Siva Rao
Published on: 18 April 2021 1:45 PM IST
YS Sharmila Hunger Strike
X

వైఎస్ షర్మిల దీక్ష 

YS Sharmila: వైఎస్ షర్మిల దీక్ష విరమించారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలతో దీక్ష విరమింపజేశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ద షర్మిల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ధర్నాచౌక్‌ వద్ద సాయంత్రం వరకే అనుమతి ఉదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పాదయాత్రగా ఆమె లోటస్‌పాండ్‌కు బయలుదేరారు. మధ్యలోనే మరోసారి పోలీసులు అడ్డుకుని లోటస్‌ పాండ్‌కు తరలించడంతో.. వైఎస్‌ షర్మిల అక్కడే దీక్షను కొనసాగించారు.

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబ సభ్యుల సమక్షంలో దీక్ష విరమించిన అనంతరం... ప్రభుత్వంపై పోరాటానికి మరో నిర్ణయం ప్రకటించారు. గత మూడు రోజులుగా లోటస్‌పాండ్‌లో దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. షుగర్‌ లెవల్స్‌ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story