Telangana: ధాన్యం కొనుగోళ్ల అంశం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్

Telangana: 72 గంటలపాటు దీక్షకు ఏర్పాట్లు చేసిన వైఎస్ షర్మిల

Sandeep Eggoju
Published on: 11 Nov 2021 9:01 PM IST
YS Sharmila Going to be do a 72 Hours Initiate in Telangana
X

వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

Telangana: ధాన్యం కొనుగోళ్ల అంశం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ కేంద్రంపై పోరు బాటకు సిద్ధమవుతున్నవేళ.. ధాన్యం కొనాల్సిందే అని వైఎస్సార్‌టీపీ అథ్యక్షురాలు షర్మిల గులాబీ దళంపై దీక్షకు సిద్ధమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటలపాటు దీక్ష చేయడానికి నిర్ణయించారు. అయితే, షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రేపు ధర్నా చౌక్‌లో టీఆర్ఎస్ ధర్నా ముగియగానే.. ఎల్లుండి ధర్నాచౌక్, ఇందిరాపార్క్‌ దగ్గర 72దీక్షకు షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ దీక్షకు అనుమతి పోలీసుల అనుమతి కోరారు. అయితే, పోలీసులు మాత్రం షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వడంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story