YS Sharmila: ఖమ్మం జిల్లాలో షర్మిల నిరాహార దీక్ష

Sandeep Reddy
Published on: 20 July 2021 11:22 AM IST
YS Sharmila Goes on Unemployment Hunger Strike in Khammam District
X

షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిల పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవడంతో నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని షర్మిల ముందు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. మనో ధైర్యం కోల్పోవద్దని కుటుంబానికి అండగా ఉంటానని షర్మిల హమీ ఇచ్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story