YS Sharmila: కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. కేసీఆర్ ఇంటి ముందు..

YS Sharmila: బీఆర్ఎస్ లోనే 33 శాతం రిజర్వేషన్ లేదు

Jyothi
Updated on: 10 March 2023 1:58 PM IST
YS Sharmila Fire On MLC Kavitha
X

YS Sharmila: కవిత దీక్ష కేసీఆర్ ఇంటి ముందు చేయాలి

YS Sharmila: మహిళా బిల్లు పై దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీలోనే 33 శాతం రిజర్వేషన్ పాటించలేదన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇరుకున్నందుకే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొచ్చిందని విమర్శించారు. కవిదీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని, కేసీఆర్ ఇంటి ముందు చేయాలన్నారు. లిక్కర్ స్కాంపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శించారు షర్మిల. ఢిల్లీలో కవిత సోనియా గాంధీని పొగుడుతారు.. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తే వీళ్లంతా ఏకమవుతున్నట్టుగానే భావించాలని చెప్పుకొచ్చారు.

Jyothi

Jyothi

Next Story