YS Sharmila: భావోద్వేగానికి గురైన షర్మిల

YS Sharmila: పాలేరు నుంచి పోటీ చేస్తానని మాట ఇచ్చా

Jyothi
Published on: 3 Nov 2023 2:19 PM IST
YS Sharmila Emotional
X

YS Sharmila: భావోద్వేగానికి గురైన షర్మిల

YS Sharmila: వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌కు మద్దతిస్తామన్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని మాట ఇచ్చానని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాట నిలబెట్టుకోలేక పోతున్నానని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజకీయంగా తాను తీసుకున్న నిర్ణయం పట్ల ఎవరైనా బాధ పడితే.. మన్నించాలని వేడుకున్నారు. పాలేరులో తాను చేసిన ప్రతి పోరాటంలో పొంగులేటి శ్రీను అన్న తన వెంట ఉన్నారన్నారు.

వైఎస్సార్‌ చనిపోయిన రోజున తమ కుటుంబానికి పొంగులేటి ఎంతో అండగా ఉన్నారని గుర్తుచేసుకున్న షర్మిల.. ఇప్పుడు శ్రీను అన్న పోటీలో ఉన్నారు కాబట్టి తానేం చేయాలో ప్రజలే తనకు చెప్పాలన్నారు. పాలేరులో పోటీ చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని, దానికి ఇంకా సమయం ఉందన్నారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story