YS Sharmila: కేసీఆర్ సీఎం కాదు.. తాలిబన్లకు అధ్యక్షుడు

YS Sharmila: కేసీఆర్ పాలనలో ఎన్నికలు సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదు

Jyothi
Published on: 28 May 2023 5:31 PM IST
YS Sharmila Comments On KCR
X

YS Sharmila: కేసీఆర్ సీఎం కాదు.. తాలిబన్లకు అధ్యక్షుడు

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్ పై, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో నడుస్తుంది... ప్రజాస్వామ్యం కాదని....తాలిబన్ల పాలనని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు అని షర్మిల ట్వీట్ చేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదన్న షర్మిల...తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ హక్కుల కోసం ఉద్యమం చేస్తానంటున్నాయన.. స్వరాష్ట్ర హక్కుల కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీపై కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశారా? అని షర్మిల ట్వీట్టర్‌లో ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story