YS Sharmila: MSC పొలిటికల్‌ సైన్స్‌ చదివానని చెప్పే అపరమేధావి కేసీఆర్.. ఏం కట్టినా మహాద్భుతమే

YS Sharmila: రాష్ట్రం మెచ్చిన సెక్రటేరియట్ కడితే గోడలకు బీటలు

Dhatripriya
Updated on: 4 May 2023 7:27 PM IST
YS Sharmila Comments On KCR
X

YS Sharmila: MSC పొలిటికల్‌ సైన్స్‌ చదివానని చెప్పే అపరమేధావి కేసీఆర్.. ఏం కట్టినా మహాద్భుతమే

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు YSRTP షర్మిల. ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. MSC పొలిటికల్ సైన్స్‌ చదివానని చెప్పే అమరమేధావి కేసీఆర్‌ గారు ఏం కట్టినా మహాద్భుతమే అన్నారు. ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం కడితే ఒక్క వరదకే మునిగిందని.. దేశం మెచ్చిన యాదాద్రి కడితే చిన్నవానకే చిందరవందర అయిందని.. రాష్ట్రం మెచ్చిన సెక్రటేరియట్‌ కడితే గోడలకు బీటలు వారాయని.. రెండు జల్లులకే నీటి ఎత్తిపోయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. జనం మెచ్చిన పరీక్షలు పెడితే పేపర్ లీకులు.. సర్కారు లింకులని విమర్శించారు. సారు ఏం చేసినా.. ఏం కట్టినా.. అవినీతి చిట్టాలు.. అక్రమాల పుట్టలు అంటూ ఆరోపించారు. సచివాలయ నిర్మాణంపై దర్యాప్తు చేయాలని.. భవన నాణ్యతపై పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు. 16 వందల కోట్ల ఖర్చుపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story