YS Sharmila: ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్.. సొంతపార్గీ నేతల అవినీతి కనిపించడం లేదా..?

YS Sharmila: లిక్కర్ స్కామ్ గుట్టు రట్టు అవుతుందనిభయమా

Dhatripriya
Updated on: 28 April 2023 2:29 PM IST
YS Sharmila Comments On KCR
X

YS Sharmila: సొంతపార్గీ నేతల అవినీతి కన్పంచడం లేదా..? మంత్రుల అవినీతి బాగోతాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు 

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు షర్మిల.. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తప్పు చేస్తే నా బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదని... జైలుకు పంపుడే అన్న కేసీఆర్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే దళిత బంధులో లంచాలు తీసుకుంటుంటే కనిపించడం లేదా అని మండిపడ్డారు. ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే ముందు వెనకా ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా... మరి ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో తెలిసినా కూడా సదరు వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీ పార్టీకి రాష్ట్రాన్ని పాలించే స్థాయి లేదని... వచ్చే ఎన్నికల్లో మీకు మీ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.


Dhatripriya

Dhatripriya

Next Story