YS Sharmila: కేసీఆర్ మెడలు వంచాల్సిన అవసరం ఉంది

YS Sharmila: TSPSC పేపర్ లీక్‌తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు

Jyothi
Published on: 10 April 2023 1:10 PM IST
YS Sharmila Comments On KCR
X

YS Sharmila: కేసీఆర్ మెడలు వంచాల్సిన అవసరం ఉంది

YS Sharmila: బీఆర్ఎస్ సర్కార్ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల.. నిరుద్యోగులను కేసీఆర్ నిండా ముంచారని మండిపడ్డారు.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌‌లో YSRTP ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి షర్మిలతో పాటు...వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. కొత్త జిల్లాలను, మండలాలను ఏర్పాటైతే చేశారు గానీ.. ఆ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగలేదన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని మండిపడ్డారు.. కేసీఆర్ మెడలు వంచాల్సిన అవసరం ఉందన్న ఆమె... ఈ నెల 17న 48 గంటలపాటు నిరాహార దీక్ష చేద్దామని అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story