YS Sharmila: తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు?

YS Sharmila: గాల్వన్‌లో అమరులకు కేసీఆర్ రూ.10లక్షలు ఇవ్వడం తప్పుకాదు

Rama Rao
Updated on: 5 May 2022 12:54 PM IST
YS Sharmila Comments on CM KCR | TS News Today
X

YS Sharmila: గాల్వన్‌లో అమరులకు కేసీఆర్ రూ.10లక్షలు ఇవ్వడం తప్పుకాదు

YS Sharmila: గాల్వన్‌లో అమరులైన సైనిక కుటుంబాలకు పది లక్షలు ఇవ్వడం తప్పు కాదన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరని షర్మిల ట్వీట్ ద్వారా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. 12 వందల మంది అమరులయ్యారని గొంతు చించుకుని.. అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారని అన్నారు. నోటిఫికేషన్ల కోసం ఆత్మత్యలు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరన్నారు. కనీసం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకివ్వరని ప్రశ్నించారు. సొంత రాష్ట్రం వారిని అల్లం బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్ కు బాట అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.



గాల్వన్ లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ
తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న మీకు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు?1/2

Rama Rao

Rama Rao

Next Story