YS Sharmila: సీఎం కేసీఆర్‌పై YSRTP అధ్యక్షురాలు షర్మిల విమర్శలు

YS Sharmila: కేసీఆర్‌కు ఎన్నికలపుడే బీసీలు గుర్తొస్తారు

Dhatripriya
Published on: 19 May 2023 2:28 PM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై YSRTP అధ్యక్షురాలు షర్మిల విమర్శలు

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై విమర్శలతో మరో ట్వీట్ చేశారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. ఎన్నికల వేళ మాత్రమే కేసీఆర్‌కు బీసీలు గుర్తొస్తారన్నారు. ఓట్ల కోసం లక్ష సాయమంటూ నయా వంచనకు తెరలేపారని ఆరోపించారు షర్మిల. దళిత బంధు పేరుతో దళితులను.. గిరిజన బంధు పేరుతో గిరిజనులను మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ.. బీసీలకు కేటాయించిన బడ్జెట్‌లో రూపాయి కూడా ఖర్చు చేసింది లేదన్నారు.

ఐదేండ్ల కింద ఇచ్చిన బీసీ సబ్‌ప్లాన్ హామీ కూడా అటకెక్కిందన్నారు షర్మిల. బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతుంటే.. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలా అని ప్రశ్నించారు.


Dhatripriya

Dhatripriya

Next Story